TEJA NEWS

తుడా టవర్స్ నిర్మాణం వేగవంతం కావాలి
** కాంట్రాక్టర్ కు తుడ వైస్ చైర్మన్ ఆదేశం

తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ) ఆధ్వర్యంలో అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడ టవర్స్ నిర్మాణ పనులను తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుడ టవర్స్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ప్లాన్ ప్రకారం పనులు చేయాలని, ఆదిశగా అధికారులు అందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి, ఈ.ఈ.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు