
మే 22 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన……… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
పరీక్షలకు 5723 మంది హాజరుకానున్న విద్యార్థులు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
వనపర్తి
జిల్లాలో మే 22వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ఐడిఓసి లోని ప్రజావాణి హాల్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుండి ప్రారంభమయ్యే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 3631 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరానికి సంబంధించి 2092 మంది విద్యార్థులు, మొత్తంగా 5723 (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్, సమయానికి ఆర్టిసి బస్సులు నడపాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మౌలిక వసతుల తో పాటు ప్రథమ చికిత్స కిట్ల తో ఏ ఎన్.యం. ఆశా వర్కర్లను నియమించాలని వైద్య అధికారిని ఆదేశించారు. పరీక్షలు జరుగనున్న ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసేవిధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచెవిధంగా చూడాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సి.సి టి.వి కెమెరాలు ఉండేవిధంగా చూడాలని సూచించారు. చీఫ్ సూపరిండెంట్లు పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకు వెళ్ళవద్దని సూచించారు. చీఫ్ సూపర్డెంట్లతో పరీక్షలకు సంబంధించి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య మాట్లాడుతూ మే 22 నుండి 29 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో ఉదయం 9 నుండి 12.00 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని వివరించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అతను కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
