
జనసేన సభ్యత్వం.. భవిత బంగారం…
జనసైనికులకు, ప్రత్యేక సందేశాన్ని లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్
క్రియాశీలక సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించిన నా సేన కోసం నా వంతు కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..
క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు అందజేసిన నా సేన కోసం నా వంతు కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..
సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు జనసేన కిట్లు అందించి, ప్రయోజనాలను వివరించాలని సూచన..
గ్రామీణ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న రాజానగరం నియోజకవర్గ జనసైనికులకు, వీర మహిళలకు రాజానగరం మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు అందజేసిన నా సేన కోసం నా వంతు కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .. క్రియాశీలక సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..
ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ జనసైనికులు, వీర మహిళల సంక్షేమం దృష్ట్యా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎవరైనా క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అంటే ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని తెలియజేసుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు..ఈ సభ్యత్వం యొక్క విశిష్టతను పవన్ కళ్యాణ్ ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టడం జరిగిందని దీనికి ఆయన పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి… ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకు పరోక్షంగా పెద్దన్నలా ఆదుకుంటున్నారని వివరిస్తూ…. తద్వారా జనసేన కుటుంబాలకు ఆర్థికపరమైన భద్రతను, భరోసాను కల్పిస్తున్నామని తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు..
