TEJA NEWS

తిరుపతిలో ముమ్మరంగా హౌసింగ్ జియో ట్యాగింగ్ మేళా

కమీషనర్ ఎన్.మౌర్య

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. జియో ట్యాగింగ్ వెళ్ళే లబ్ధిదారుల వాహనాలను కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో తిరుపతి నగరంలో ఇంటి పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు చిందేపల్లి, ఎం.కొత్తపల్లి, కల్లూరు, లేఔట్లలో నిర్మిస్తున్న ఇళ్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 19,086 మంది లబ్ధిదారులకు గాను దాదాపు 10,000 వేల మందికి జియో ట్యాగింగ్ పూర్తయిందని, మిగతా పెండింగ్ లబ్ధిదారులకు ఈ 19, 20, 21 తేదీలలో మూడు రోజులపాటు 9086 మంది లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ మూడు రోజులలో ఎవరైనా వెళ్లకపోతే మిగతా రోజులలో లబ్ధిదారులు వారికి ఇచ్చిన ఇంటి పట్టా ఆధారంగా లేఅవుట్ కు వెళ్లి లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హౌసింగ్ డిఈఈ లు మోహనరావు, శ్రీనివాస్, కుమార్, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, సెక్టోరల్ ఆఫీసర్లు, సచివాలయ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.