TEJA NEWS

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలి
రాష్ట్ర నాయకులు – యేసురత్నమ్

నేడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి ఆధవర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నమ్, మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య ,హాజరై వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కులకై పోరాడి న అక్టోబర్ విప్లవాన్ని తెచ్చి కార్మిక కర్షక కష్టజీవుల హక్కులను కాలరాసే పెట్టుబడి దారీ వ్యవస్థను తుదముట్టించిన ఘనత లెనిన్ కే దక్కుతుందని, అలాగే నేడు దేశంలో మతవిద్వేశాన్ని రెచ్చగొట్టి కులం మతం పెర మనిషి కి మనిషికి మధ్య చిచ్చుపెట్టిన చూస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందుకు నిదర్శనమే ఈ నెల 22న అయోధ్యలో ప్రారంభించే రాముల వారి మందిరానికి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడం, సినిమా యాక్టర్లను పిలవడం ఇందుకు నిదర్శనమని అన్నారు.కావున నేడు లేనిన్ ఆశయాలకనుగునంగా ప్రజలంతా ఏకమై కులం మతం కాదని నిరుపేద ప్రజలకు కూడు,గూడు, కావాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, ప్రజలందరికీ న్యాయమైన విద్య ,వైద్యం అందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన జరగాలని ఇవన్నీ కావాలంటే ప్రజలంతా ఏకమై మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు..అనంతరం సీపీఐ ఆపిస్ నుండి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి లెనిన్ చిత్రపటానికి ,భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మున్సిపల్ జిల్లా అధ్యక్షులు రాములు, ఏ ఐ టి యు సి మండల అ్యక్షుడు వుజ్జిని హరినాథ్ రావు,డప్పు రామస్వామి ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్ , రాజు, కృష్ణ , వెంకటరెడ్డి,బాబు, జానకి రామ్,ఇమామ్, ప్రభాకర్, శ్రీనివాస్ చారి, శివారెడ్డి, మల్లారెడ్డి, డ్రైవర్ బాబు, చంద్రయ్య, మల్లయ్య, నరసింహ, గణేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS