
గ్రీనరీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
** ప్రమాణస్వీకారంలో తిరుపతి టీడీపీ నేతలచే సన్మానం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మను సీఎం చంద్రబాబు ఇటీవల నియమించారు. ఈమేరకు ఆమె బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ నేతలు అయిన “శాప్” చైర్మన్ రవినాయుడు, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, ఊట్ల సురేంద్ర నాయుడుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలసి సుగుణమ్మను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా అనుగ్రహించి, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. అలాగే సుగుణమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా ఈ కార్యక్రమాలను చేపట్టి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవి నాయుడు, ఆర్.సి మునికృష్ణ, దంపురి భాస్కర్ యాదవ్, ఉట్ల సురేంద్ర నాయుడు, బి.జి.కృష్ణ యాదవ్, కంకణాల రజనీకాంత్, డిజిటల్ వ్యాపారి శ్రీనివాసులు, శ్రీధర్ వర్మ, గాలి పవన్, జయరాం రెడ్డి, రవితేజ నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, కరాటి చంద్ర, శంకర్, విశ్వనాథం, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
