TEJA NEWS

మాజీ ప్రధాని స్వర్గీయ కి.శే రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

మాజీ ప్రధాని స్వర్గీయ కీ.శే రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిదిలోని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో చిత్రపటానికి కార్పొరేటర్ పూలమాల వేసి ఘణ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, పోశెట్టిగౌడ్, బాలస్వామి, ఖలీమ్, రాజ్యలక్ష్మి, రమాదేవి, సౌందర్య, అరుణ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.