
శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తిరగల దిన్నె గ్రామంలో శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పామూరు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీనివాసులు, ఉప్పలపాటి హరిబాబు, తిరగల దిన్నె బూత్ కమిటీ ఇన్చార్జ్ ఆవుల రమణమ్మ, నుచ్చు పొద టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కామినేని సూర్య, తదితర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. తిరగల దిన్నె గ్రామస్తులు మల్లె బోయిన గురుబ్రహ్మం, మల్లె బోయిన బాల బ్రహ్మయ్య, రాజా, శివరామయ్య, బ్రహ్మయ్య, ఎంపీటీసీ సభ్యులు బొట్ల నాగార్జున, బొట్ల కోటయ్య, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, నాగేంద్ర తదితర గ్రామస్తులు విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లను పర్యవేక్షించారు.
