
ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు: రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం
అమరావతి: రేషన్ కార్డులపై ఏపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి గడువు ఏమీ ఉండదని, దరఖాస్తు ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
✧ అలాగే, దరఖాస్తు చేసిన వారందరికీ 21 రోజుల్లోపే కొత్త కార్డులు జారీ చేస్తున్నామని ఆయన వివరించారు.
✧ ఇక, కేంద్రం ఈ-కేవైసీని తప్పనిసరి చేయడంతో దేశంలో అత్యధికంగా — 95 శాతం ఈ-కేవైసీ పూర్తిచేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి వెల్లడించారు.
