TEJA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు సొంతింటి కల నెరవేరబోతుంది ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ గృహాలకు అర్హత పొందిన లబ్ధిదారులకు హక్కుపత్రాలను గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు గృహహక్కుల కోసం కృషి చేస్తోందన్నారు ప్రతి పేద కుటుంబం తల దాచుకునే ఇంటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ గృహాల అమలను వేగంగా అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి ఎంపీఓ రామారావు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.