
జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
శిక్షణ కేంద్రం కోసం కృషిచేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా. మల్లురావి కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి
గ్రామీణ ప్రాంతాల్లోని యువత స్వయం ఉపాధిలో స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం వనపర్తి జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు_
2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ నిర్మాణానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు
ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ కేంద్రంలో అందించే ప్రత్యేక శిక్షణతో యువకులకు వివిధ సంస్థలలో ఉపాధి కల్పన లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు
ఈ శిక్షణ కేంద్రం వనపర్తి లో ఏర్పాటు అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దామోదర రాజనర్సింహ కి, జిల్లా మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కి, ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
