
ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థి గా పోటీ చేస్తున్న సరస్వతి విద్యావిహార్ సంస్థల అధిపతి
డాక్టర్ సుంకర శ్రీనివాసరావు కి మద్దతు తెలపడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో సరస్వతి విద్యా విహార్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు , వ్యవస్థాపక అధ్యక్షులు ఫణీంద్ర కుమార్ , వ్యవస్థాపక ఉపాధ్యక్షులు చెన్నకేశవుల రమేష్ , అధ్యక్షులు హరిదాసుల లీలా వేణు మాధవ్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి అన్ని నియోజకవర్గాల కార్యవర్గ సభ్యులు మరియు
రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్యాసినాయుడు , జిల్లా అధ్యక్షులు మజ్జి ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి గుండు రాజేశ్వర్ రావు , ఆర్థిక కార్యదర్శి సోమేశ్వరరావు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ హాజరయ్యారు . ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన కమిటీలు కూడా వేయడం జరిగినది.
రాష్ట్ర నాయకత్వం విజయనగరం జిల్లా ను సందర్శించి అక్కడి విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఏకగ్రీవంగా సుంకర శ్రీనివాస్ రావు కి మద్దతు తెలపడం జరిగింది.
