
వార్డు అభివృద్ధికి కృషి చేసిన కౌన్సిలర్ నాగన్న యాదవును సన్మానించిన 32 వ వార్డు ప్రజలు
- వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డు అభివృద్ధికి కృషిచేసిన తాజా మాజీ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ను ఆ వార్డు ప్రజలు మంగళవారం శాలువాతో కప్పి సన్మానించడం జరిగింది గడచిన ఐదు సంవత్సరాలలో వార్డు ప్రజలతో మమేకమై వారికి అనునిత్యం అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీ నుండి అందవలసిన ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో నాగన్న యాదవ్ ఎంతో కృషి చేశారని రానున్న కౌన్సిల్ ఎన్నికల్లో నాగన్న యాదవ్ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని వార్డు ప్రజలు ఈ సందర్భంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి నవీన్ సతీష్ గౌడ్ వినోద్ సూరి నాయుడు సత్యం మహేష్ శీను మహేందర్ సురేష్ చిన్న గౌడ్ వినోద్ జ్ఞానేశ్వర్ గోపి మేస్త్రి వెంకటయ్య డబ్బా రాజు లు కౌన్సిలర్ను సన్మానించిన వారిలో ఉన్నారు
