Spread the love

బంగారు బాల్యం, తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో చార్టెడ్ అకౌంటెంట్ పట్టాపుచ్చుకున్న ఊసా మౌనిక

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ కోకోనట్ మర్చంట్ ఉసా మధుసూదన్ రావు శ్రీమతి నారాయణమ్మ దంపతుల కుమార్తె ఉసా మౌనిక చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసుకుని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ అకౌంటెంట్స్ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం లో ఐసి ఏఐ నిర్వహించిన కన్వో క్షన్ లో సి ఎ పట్ట తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉషా మధుసూదన్ రావు, నారాయణమ్మ, సోదరులు వెంకట తరుణ్ కుమార్, వెంకట చరణ్ కుమార్ మౌనికకు అభినందనలు తెలిపారు. పామూరు పట్టణంలోని టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, బోయిండ్ల నారాయణరెడ్డి, బిజెపి నియోజకవర్గ కొండిశెట్టి వెంకటరమణయ్య, మాజీ సర్పంచులు కావిటి వెంకట సుబ్బయ్య, డివి మనోహర్ ప్రసాద్, జనసేన నాయకులు యలమందల రహీముల్లా, బాలాజీ జ్యువెలర్స్ అధినేత గుత్తి వెంకటరాజా, టిడిపి నాయకులు షేక్ గౌస్ బాషా, ఫత్తు మస్తాన్, షేక్ ఖాజా రహమతుల్లా, మొబీనా మౌలాలి, తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు ఊస మౌనికకు అభినందనలు తెలిపి ఆశీర్వచనాలు అందజేశారు.