
క్రీడలతో మానసిక, శారీరక దారుఢ్యం
అంబేడ్కర్ స్పూర్తితో కబడ్డీ పోటీల నిర్వహణ అభినందనీయం
జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ
చిలకలూరిపేట:క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జనసేన పార్టీ నాయకులు మండల నేని చరణ్‌తేజ చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్బంగా పట్టణంలోని తూర్పు మాలపల్లెలో బీ.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ కమిటీ ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను చరణ్‌తేజ సందర్శించారు. కార్యక్రమానికి వచ్చిన చరణ్‌తేజ ను కమిటీ సభ్యులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలతో పాటు విద్య, ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కబడ్డీ పోటీలకు పెద్ద ఎత్తున్న క్రీడాకారులు హాజరుకావడం శుభ సూచికమన్నారు. కార్యక్రమంలో జనసైనికులు ,కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
