TEJA NEWS

హైదరాబాద్‌: మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డ్‌ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వైపు వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి.. యూటర్న్‌ సమీపంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న రాజవర్ధన్, వికేందర్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.