Spread the love

ఆలపాటి అనుభవం.. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది – MLA బొండా ఉమ

27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలి
ఉదయం 9:30″గం లకు” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం A.K.T.P  స్కూల్ నందు MLC ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అవగాహన కల్పించడం జరిగినది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పనితీరు, వ్యక్తితం గురించి వారికి వివరించారు, ఆలపాటి అన్నివేళలా ప్రజలకోసం అందుబాటులో ఉండే వ్యక్తని, ఆయన గెలుపుతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుందని…

ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని MLC గా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలు తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం అని, చదువుకున్నటువంటి వారి  గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి అవసరమైనటువంటి విధముగా ఉద్యోగులకు ప్రధానముగా ఉపాధ్యాయులకు అన్ని రకాల అయినటువంటి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి  అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో ప్రదానంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని అందుకని MLC గా రాజేంద్రప్రసాద్ ను గెలిపిస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు…

ఈ కార్యక్రమంలో:-AKTP స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,మాస్టన్ ,డివిజన్ పార్టీ ఇంచార్జి గార్లపాటి విజయకుమార్,అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చామర్తి రవిబాబు,పొట్లూరి కృష్ణ ప్రసాద్,శోభన చలం,
ధనలక్ష్మి,శంకర సాయి,వేమూరి భాను,
శివరాం తదితరులు పాల్గొన్నారు…