
అన్నపురెడ్డిపల్లి మండలంలోని, భారీ అగ్ని ప్రమాదానికి సజీవ దహనమైన వ్యక్తి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
అశ్వరావుపేట మండలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం. అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్ద రెడ్డి గూడెం టీడీ బంజర్ లో, షార్ట్ సర్క్యూట్ కారణంగా, అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా, ఒక ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు, గౌస్ పాషా. మంటలు అంటుకొని సజీవ దహనం అయ్యాడని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో,భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. పంచాయతీ ట్రాక్టర్ తో, మంటలు అదుపు చేసామని స్థానికులు తెలిపారు.
