
అక్రమణలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ స్వయంగా తొలగిస్తారు
రోడ్లపైకి వచ్చే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం
జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా పెడతాం
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు హెచ్చరిక
చిలకలూరిపేట పట్టణంలో అక్రమణలకు గురైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రమాదాలపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సర్కిల్ నుంచి నరసరావుపేటకు వెళ్లే దారిలో, టిడ్కో, పసుమరు ప్రాంతాలలో ఇళ్లు కేటాయించినప్పటికీ, ప్రజలు గుడిసెలు వేసుకుని రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. అడ్డరోడ్డు సెంటర్లోనే కోటప్పుకొండ రోడ్డులో షాపులు, కేబీ రోడ్డు, నరసరావుపేట సర్కిల్ నుంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయని, దీని వల్ల ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అనేకసార్లుఆక్రమణలుతొలగించినప్పటికీ, వ్యాపారస్తులు తిరిగి రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సమస్యలకుకారణమవుతున్నారని శ్రీహరి బాబు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్ అధికారులు త్వరలో రోడ్లపై మార్కింగ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కింగ్ దాటి రోడ్లపైకి వచ్చే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా పెడతామని ఆయన హెచ్చరించారు.ట్రాఫిక్ సమస్యలు లేకుండా, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అక్రమణలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ స్వయంగా తొలగించి, అందుకు అయ్యే ఖర్చులను అక్రమణదారుల నుంచి వసూలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నోటీసులు రెండు మూడు రోజుల్లో సర్వ్ చేయబడతాయని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా, సజావుగా కార్యకలాపాలు సాగించడానికి ప్రజలు, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు.
