TEJA NEWS

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఎంఈఓ కి వినతి పత్రం

ముందస్తు అడ్మిషన్ చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ఎంఈఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో
ఏఐఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 2025 2026 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ దాకా ముందుకే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు అడ్మిషన్లు చేస్తే మీకు 10% 15% తగ్గిస్తామని చెప్పి వాళ్ళ రక్తాల పిండి ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల యాజమాన్యం ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న బచ్పన్, మిలీనియం, SPR పాఠశాలలో అన్ని బ్రాంచులు ఇదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు అదేవిధంగా తన ఇష్టానుసారంగా ప్రభుత్వానికి విరుద్ధంగా నడుచుకుంటున్న పాఠశాలలపై ఎంఈఓ తక్షణమే చర్య తీసుకుని ఆ స్కూల్స్ ను సీజ్ చేసే విధంగా కృషి చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య నాగర్ కర్నూల్ జిల్లా సమితి పక్షాన కోరడం జరిగింది. లేని క్రమంలో కల్వకుర్తి ప్రాంతంలో ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కలవకుర్తి నియోజకవర్గ నాయకులు మధు రిత్విక్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.