TEJA NEWS

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలుగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి

డిపిఆర్, ఎస్టిమేట్ తయారు చేసి గ్రామాల వారీగా ప్రణాళిక సిద్ధం చేయాలి

కలిసి కట్టుగా పనిచేద్దాం.. ప్రజలకు మంచి సేవలను అందిద్దాం..

— ఎమ్మెల్యే బత్తుల

సీతానగరం మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లో శుక్రవారం మండల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొని కీలక అంశాలపై అధికారులతో చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కొత్తగా సీసీ రోడ్లు, గ్రామాల్లో మేజర్ డ్రైన్లు 3 అడుగులు లేదా 2 అడుగులు చిన్న చిన్న వీధుల్లో అడుగు డ్రైన్స్ ఉన్నాయి.. ఈ డ్రైన్స్ అన్ని కూడా DPR తయారుచేసి గ్రామాల వారీగా నాకు అందించాలని సెక్రటరీ లను ఆదేశించారు..నేను గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానిక నాయకులు, గ్రామస్తులు ముఖ్యంగా డ్రైనేజి సమస్య అస్తవ్యస్తంగా ఉందని నా దృష్టికి తీసుకువస్తున్నారు..సీతానగరం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఎన్ని డ్రైన్లు ఉన్నాయి. అవి ఎంత దూరం ఉన్నాయి.. అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ కొత్తవి నిర్మించాలి అనే దానిపై నాకు సమగ్ర నివేదిక ను అందజేస్తే నేను సంబంధిత మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది.. అలాగే సీసీ రోడ్లు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి.. వాటి మీద కూడా పూర్తి నివేదిక నాకు అందజేయండి…

ఏ గ్రామాల్లో కూడా డ్రైనేజి సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉండకూడదు అనేది నా లక్ష్యం..కనెక్టింగ్ రోడ్స్ వివరాలు కూడా సిద్ధం చేయండి.. సీతానగరం మండలంలో పుంత రోడ్లు లేకపోవడం వలన పొలాల్లోకి రైతులు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. పండిన పంటను తెచ్చుకోవడానికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి..సీతానగరం మండలంలో పుంత రోడ్ల మీద కూడా నాకు వివరాలు అందజేయండి.. అలాగే విద్యుత్ శాఖ వారు గ్రామాల్లో విద్యుత్ స్థంబాలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో, పాత వాటిని తీసి కొత్తవి ఎక్కడెక్కడ వేయాలో వివరాలు అందజేయండి.. స్మశాన వాటికలో సరైన సదుపాయాలు లేవు. కనీస అవసరమైన నీళ్లు కూడా లేని దుస్థితి ప్రస్తుతం ఉంది.. కాబట్టి వాటి మీద నివేదిక అందజేయండి.. త్రాగు నీటి సమస్య లేకుండా పరిష్కారించాలంటే పైప్ లైన్స్ ఎక్కడ వేయాలో కూడా నివేదిక అందజేయండి.. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు త్రాగు నీరు సమస్య లేకుండా చూడాల్సిన భాద్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసారు.. మనమందరం కలిసి కట్టుగా పనిచేద్దాం.. ప్రజలకు మంచి సేవలను అందిద్దాం..

ఎంపీడీఓ, EOPRD & RD, EO, AO , జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు..