
జగిత్యాల జిల్లా..
- – – జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం “సురక్షిత ప్రయాణం” అనే ప్రత్యేక కార్యక్రమం
- – – జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశ్యంతో జిల్లా అశోక్ కుమార్ ఐపిఎస్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలు( బ్లాక్ స్పాట్స్) సందర్శన
- – – రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి
- – – జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశ్యంతో “సురక్షిత ప్రయాణం” అనే ప్రత్యేక కార్యక్రమని జిల్లా ఎస్పి ప్రారంబించారు. ఇందులో బాగంగా ఈరోజు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలు( బ్లాక్ స్పాట్స్) ను నెషనల్ హైవే అథారిటీ అధికారులు మరియు పోలీసు అధికారులతో కలిసి ఎస్పి సందర్శించారు.
ఈ సందర్బం గా ఎస్పి మాట్లాడుతూ … రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అవసరం అని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే 43 ( బ్లాక్ స్పాట్స్) ప్రాంతాలను గుర్తించడం జరిగిందని వివిద శాఖల సమన్వయంతో ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కళా బృందం ద్వారా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కలిగించడం జరిగిందని, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాలను వివరించడానికి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడంతోపాటు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా లో ఎక్కువగా ప్రధాన రహదారికి కలిసే రోడ్డుల వద్ద అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఎక్కువగా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్బంగా ఎస్పి గారు ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను పరిశీలించి, రోడ్డు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, మార్పుల పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
🔹 ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు & స్పీడ్ బ్రేకర్లు తక్షణమే ఏర్పాటు చేయాలి.
🔹 అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు & సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
🔹 అధిక వేగంతో వాహనాలను నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు – ఫైన్ విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవాలి.
🔹 రోడ్డు పక్కన అక్రమంగా పార్క్ చేసిన ట్రక్కులు, లారీలు, ఇతర వాహనాలను తొలగించాలి.
🔹 రాత్రివేళ ప్రమాదాల నివారణ కోసం స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలి.
🔹 డ్రైవర్లు & ప్రయాణీకులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
🔹 సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించడం వంటి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా అమలు పరచాలి.
ఎస్పి వెంట డిఎస్పి రఘు చంధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, సి.ఐ లు వేణుగోపాల్ ,కృష్ణ రెడ్డి ,రవి ,ఎస్. ఐ లు సదకర్ ,నరేష్ మల్లేషం, NH AE లక్ష్మణ్, AMVI ప్రమీల పాల్గొన్నారు.
