కూలీల కష్టాలకు అండగా… సమస్యల పరిష్కారానికి ముందడుగు ..

TEJA NEWS

కూలీల కష్టాలకు అండగా… సమస్యల పరిష్కారానికి ముందడుగు …

అంతర్గాం మండలంలోని లంబాడి తండాలో ఉపాధి హామీ కూలీలతో మనాలి రాజ్ ఠాకూర్ భేటీ….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ ఈ రోజు అంతర్గాం మండలం లంబాడి తండా గ్రామంలో ఉపాధి హామీ పథకం (100 రోజుల పనులు) కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూలీలతో నేరుగా మాట్లాడిన మనాలి రాజ్ ఠాకూర్ పనుల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఆత్మీయంగా విన్నారు. ముఖ్యంగా పెండింగ్ వేతనాలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే కూలీల సంక్షేమం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. “ప్రజల సమస్యలు మా బాధ్యత… వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు” అని మనాలి రాజ్ ఠాకూర్ భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top