Spread the love

ప్రభుత్వం స్కాలర్షిప్ & ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్

వనపర్తి
తెలంగాణలో
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ,విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగానిర్లక్ష్యానికి గురిచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.57% నిధులు మాత్రమే కేటాయించడం దారుణమని తీవ్రంగా విమర్శించారు.
గత ప్రభుత్వాల్లానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని, విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆపాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యార్థులు స్కాలర్షిప్‌లు & ఫీజు రీయింబర్స్మెంట్ రాక పై చదువులు మానుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందిస్తూ వెంటనే పెండింగ్లో ఉన్న
స్కాలర్షిప్‌లు & ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని
ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని.
విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయించాలని
విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, పవన్, గణేష్, సాయి చరణ్, నితిన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.