Spread the love

కీచక ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నిరసన,

సంఘటనపై కుల మతాల రంగు పులిమీ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు

వనపర్తి
వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మార్చ్ మొదటి వారంలో ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల ఫలితంగా ఇద్దరు ఉపాధ్యాయులను ఇటీవలే విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయడం జరిగిందని కానీ అసలైన కీచక ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ కు సోకజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పట్ల నిరసిస్తూ సోమవారం పానగల్ కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సాతర్ల అర్జున్ కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ఘటన ప్రధాన సూత్రధారి అయిన కిరణ్ కుమార్ కు కేవలం నోటీసులు జారీ చేయడం సరికాదని పాఠశాలలలో విద్యార్థినుల భద్రత దృశ్య ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా సదరు ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన కొన్ని విద్యార్థి సంఘాలు కుల మత రాజకీయాల రంగును పులిమి ఘటనను దారిమలించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఓమేష్ వినయ్ రాకేష్ గణేష్ వంశీ శరత్ గణేష్ సాయి చరణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు