
కడప క్రికెట్ స్టేడియం అభివృద్దికి కృషి చేస్తాను : ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఏసీఏ అధ్యక్షుడు,ఎంపి కేశినేని శివనాథ్ ను సన్మానించిన కడప డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్
కడప క్రికెట్ స్టేడియం సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
విజయవాడ\కడప : కడప క్రికెట్ స్టేడియంలో జాతీయ క్రికెట్ మ్యాచులు జరిగే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు, స్టేడియం అభివృద్దికి కృషి చేస్తానని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి కడప పుట్టంపల్లె లోని కడప క్రికెట్ స్టేడియాన్ని మంగళవారం సందర్శించారు. కడప స్టేడియంకు విచ్చేసిన ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ కి కడప డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, సెక్రటరీ రెడ్డి ప్రసాద్, స్టేడియం కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఎంపి కేశినేని శివనాథ్ తో పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ను శాలువాతో సత్కరించారు.
ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కడప క్రికెట్ స్టేడియం అంతా పరిశీలించారు. క్రీడాకారులు, సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. వారికి కావాల్సిన సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు అనుగుణంగా అన్నీ సౌకర్యాలు కల్పించామనీ, మరిన్నీ మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
