
కొత్తగూడెంలో ఏసీబీ దాడులు: సింగరేణి డ్రైవర్ రాజేశ్వరరావు అరెస్టు
కొత్తగూడెం, : ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ అన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన సంఘటన కొత్తగూడెంలో సంచలనంగా మారింది. సింగరేణి మెయిన్ వర్క్ షాప్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అన్న బోయిన రాజేశ్వరరావు పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
రాజేశ్వరరావు ప్రజల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇతనితో పాటు మరో బృందం ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో జరిపిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో మరికొంత మంది పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంఘటనపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
