
కేంద్ర హిందీ సలహా సంఘం సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ
విశాఖపట్నం : పద్మభూషణ్, ప్రఖ్యాత రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న హిందీ సలహా సంఘం సభ్యునిగా ఎంపికైనట్టు తెలిపారు. హిందీ సలహా సంఘం కేంద్ర మంత్రిత్వ శాఖల హిందీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ, భాషా పరంగా సమతుల్యతకు దోహదపడే విధంగా పని చేస్తుంది. ఇందులో మొత్తం పదిహేడు మంది సభ్యులు ఉండగా, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒక్కరు మాత్రమే దక్షిణ భారతదేశం నుంచి నియామకమయ్యారు.
