
రాష్ట్రా నూతన బిజెపి అధ్యక్షులు మాధవన్ ను ఘనంగా సత్కరించిన అచ్చుకోలమురళి
చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చు కోల మురళీకృష్ణ తో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షులుగా నియమితులైన ఏ.వి.యన్. మాధవన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారిని దుశ్యాలువాతో బొకేతో ఘనంగా సత్కరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ,బిజెపి నాయకులు ,రాధా రంగా మిత్రమండలి సభ్యులు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి , కాపు సంఘం నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
