Spread the love

ఆర్ఓబి నిర్మాణంలో అడ్డంకులు ఆదిగమించడానికి చర్యలు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్.హెచ్.ఏ అధికారులతో సమావేశమైన..ఎమ్మెల్యే

రైల్వే గేట్లపై ఆర్ఓబి నిర్మాణ పనులకు… సాంకేతిక అనుమతులు మంజూరు:ఎమ్మెల్యే రాము

గుడివాడ :గుడివాడలో ఆర్ఓబి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలో చర్యలు తీసుకుంటున్నామని….పూర్తి స్థాయిలో పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో….ఆర్ఓబి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలోనీ ప్రధాన రహదారుల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాము సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు…. గుడివాడ పట్టణంలో జరుగుతున్న రైల్వే గేట్లపై నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.రైల్వే గేట్ల పై ప్రాంతంలో… ఆ శాఖ అనుమతులు రాకపోవడంతో నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చాయని,ఇతర అనుమతులు మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా గేట్ల పై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టిన తర్వాత…. అత్యధిక రోజులు గేట్లు మూయాల్సి వస్తుందని, గేట్ల మూసి ఉంచే రోజులను తగ్గించడమే కాక, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా చివరి దశకు చేరుకున్న 216 జాతీయ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.అండర్ పాస్ నిర్మాణ పనులు కూడా త్వరగతిన జరిగేలా కృషి చేస్తున్నామని… ఆర్ఓబి నిర్మాణం పూర్తి కావడానికి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వేగవంతంగా నిర్మాణ పనులు జరిగేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

అదేవిధంగా గుడివాడ బస్టాండ్ సెంటర్ నుండి వాసవి చౌక్, మార్కెట్ సెంటర్, బంటుమిల్లి రోడ్డు మీదుగా బైపాస్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై…. టైయిలింగ్ ఏర్పాటు పనులు, ఐఎంఏ రహదారి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

పట్టణంలోని ప్రధాన రహదారుల ఎండ్ టూ ఎండ్ విస్తరణ, రహదారుల వెంబడి డ్రైనేజీల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు అతి త్వరలో అనుమతులు రానున్నాయని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఢిల్లీ వరకు వెల్లైనా సరే అభివృద్ధి పనులకు నిధులు సాధించేలా ఎంపీ వల్లభనేని బాలసౌరీతో కలిసి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సంజీవ రాయుడు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. శరత్ చంద్ర, ప్రాజెక్టు మేనేజర్ ఎన్. శ్రీనివాస్, టీం లీడర్ దివాకర్, రెసిడెన్ట్ ఇంజనీర్ బి. నిరంజన్ రావు,వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ఎండి వి. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.