TEJA NEWS

విలసాలకు అలవాటు పడి., చెడు వ్యసనాలుకు బానిసై.. నిత్యం చోరీలకు పాలడుతూ,బైక్ లను దొo గాలిస్తున్నా…. అంతరాష్ట్ర దొంగను చిలకలూరిపేట అర్బన్ పోలీస్ లు వల పన్నిపట్టుకున్నారు.మొత్తం 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయం పై చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో CI రమేష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాష్టం లోని గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు జిల్లా లలోని నగరాల్లో బైక్ లు చోరీలు చేసినట్లు CI రమేష్ తెలిపారు. గుంటూరు లో 7,నరసరావుపేట లో 5,చిలకలూరిపేట లో మరొక 5 బైక్ లను, చోరికి గురైయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని CI పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఏసు అనే వ్యక్తి ని అదుపులో కి తీసుకొని అతని వద్ద నుంచి 17బైక్ లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటి విలువ 24లక్షలు వరకు ఉంటుంది ని వివరాలు వెల్లడించారు.నిందితుడు ఏసు అరస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తామని CI రమేష్ తెలిపారు.