TEJA NEWS

ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి అదనపు హంగులు

రోగులకు ఉపయోగపడేలా సీఎస్ఆర్ నిధులతో వివిధ రకాల పరికరాలు

రూ.94 లక్షల నిధులతో పరికరాలు సమకూరుస్తున్న సెంబ్ కార్ప్(SEIL) కంపెనీ

ప్రభుత్వం ఐదు డయాలసిస్ యూనిట్లను మంజూరు చేయగా సీఎస్ఆర్ నిధులతో అదనంగా మూడు యూనిట్ల ఏర్పాటు

ఈ రోజు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ తో పాటు ఈసీజీ మిషన్, రెండు పల్స్ మానిటర్లను అందించిన సెంబ్ కార్ప్(SEIL) కంపెనీ

పరికరాలను సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రస్తుతం రూ.43 లక్షల విలువైన పరికరాలు అందజేయగా, త్వరలోనే అందనున్న జనరేటర్, డెంటల్ ఎక్స్ రే యూనిట్, వాషింగ్ మిషన్, 7 కంప్యూటర్లు, ఇన్వర్టర్, క్రాష్ కాట్, మూడు ఫ్రీజర్లు, 2 ఏసీలు, వాటర్ డిస్పెన్సరీ

సెంబ్ కార్ప్(SEIL) కంపెనీ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన సోమిరెడ్డి

పొదలకూరుతో పాటు మనుబోలు, సంగం, సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల్లోని ప్రజలకు డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోంది…రోగుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం

సీఎం చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి పెంచేందుకు కృషి చేస్తున్నాం..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం నిర్మించి రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాం…మళ్లీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని సౌకర్యాలు క్పలిస్తున్నాం

సామాజిక ఆరోగ్య కేంద్రం సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి