TEJA NEWS

జానంపేట రామసముద్రం చెరువు రికార్డులను పరిశీలన అనంతరం లోకాయుక్తకు సమర్పిస్తాం……… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

రేషన్ కార్డ్ దారులు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్

వనపర్తి
జిల్లాలోని శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేట రామసముద్రం చెరువుకు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి అన్నారు.

     శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేట చెరువు నీటి వల్ల తమ భూములు మునుగుతున్నాయని, మునిగిన తమ భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలంటూ చెరువు ఆయకట్టు రైతులు ఇదివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకయుక్త కు నివేదిక సమర్పించడం కొరకు జిల్లా కలెక్టర్   అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. 

  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చిన జానంపేట గ్రామ రైతులు, పిటిషన్ దారులతో మాట్లాడి, పరిస్థితులను తెలుసుకున్నారు. చెరువు నీటి వల్ల మునుగుతున్న తమ భూముల సమస్య గురించి రైతులు కలెక్టర్ కు విన్నవించారు. 

  కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రికార్డులు పరిశీలించిన అనంతరం లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 

రేషన్ కార్డుదారులు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలి
పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

      గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని  రెండవ నెంబర్ రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం తో కలిసి సందర్శించి, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. 

   అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన స్థానికులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 

  ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, సి సెక్షన్ సూపర్డెంట్ కిషన్, శ్రీరంగాపూర్ డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, గ్రామస్థులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.