
బిఆర్ఎస్ వరంగల్ సభ అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పు………… మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఏప్రిల్ 27 రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ వర్గాలకు పిలుపు
వనపర్తి :
25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో
కెసిఆర్ నాయకత్వంలో 14 ఏళ్ళు ఉద్యమ చరిత్రలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిన తీరును పునరుద్ఘాటిస్తూ కొంతమంది స్వార్థ పరులు కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో
బి ఆర్ఎస్ పార్టీకి అభిమానం తగ్గలేదని ఏప్రిల్ 27న వరంగల్ లో పార్టీ రజితోత్సవం సభ అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారం చేపట్టి పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అలవి కాని హామీలను ప్రకటించదని అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసి వచ్చిందని పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యల లో పాలుపంచుకోవాలని అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు 2500 తులం బంగారం నిరుద్యోగ భృతి ఒంటి అమలు కాని హామీ అంశాలను ప్రజలకు వివరించాలని అటువంటి నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు
రజతోత్సవ సభ సమయాన్ని కి ఇంకా 20 రోజులు మిగిలి ఉందని నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ వర్గాలకు దిశా నిర్దేశం చేస్తూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ చంద్రశేఖర్ నాయక్ కుందుర్తి యాదవ్ మార్కుపేడ్ డైరెక్టర్ విజయకుమార్ పార్టీ అధ్యక్షులు పలుసు రమేష్ గౌడ్ దిలీప్ రెడ్డి వనం రాములు రాళ్ల కృష్ణయ్య మాణిక్యం వేణు యాదవ్ వెంకటస్వామి మాజీ ప్రజా ప్రతినిధులు రఘుపతి రెడ్డి బోర్ల భీమయ్య కృష్ణ నాయక్ లక్ష్మారెడ్డి కర్ర స్వామి రాజశేఖర్ మాజీ కౌన్సిలర్ బండార్ కృష్ణ నాగన్న యాదవ్ , ఉంగ్లం తిరుమల్ ప్రేమ్ నాథ్ రెడ్డి
సమద్ స్టార్ రహీం ఇమ్రాన్ హేమంత్ ముదిరాజ్ సూర్యవంశం గిరి జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల శారద నాగమ్మ జములమ్మ సాయి లీల కవిత నాయక్ తదితరులు పాల్గొన్నారు
