TEJA NEWS

బి.సి.ఎఫ్. వనపర్తి జిల్లా “అధికార ప్రతినిధి” గా అక్కల నాగరాజు గౌడ్

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు నాగనమోని చెన్నరాములు

వనపర్తి :
బి సి ఎఫ్ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధిగా ” అక్కల నాగరాజు గౌడ్ “ని BCF రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ నియమిస్తూ ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో నాగరాజ్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం. నాగరాజు గౌడ్ మాట్లాడుతూ బి సి ఎఫ్ ను బలోపేతం చేస్తానని ఆశయాలకు అనుగుణంగా కష్టపడి నిరంతరం పనిచేసి బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా చెన్న రాములు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు 42 శాతం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించినందున వెంటనే జీవో విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో ప్రైవేటు విద్యాసంస్థలు కళాశాలలో విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నందున ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల పైన మానసిక వత్తిడి తగ్గించి వారి స్థాయికి అనుగుణంగా విద్యాబోధన చేస్తూ విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రైవేట్ విద్యాసంస్థలను డిమాండ్ చేయడం జరిగింది. యువకులు మాదకద్రవ్యాలు గుట్కాలు, మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతూ సమాజంలో అశాంతికి గురి చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖలు నిరంతరం నిఘా ఉంచుతూ గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మిల్లు యజమానులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధాన్యం లెక్క చెప్పకుండా తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వానికి రావలసినటువంటి కోట్ల రూపాయల విలువచేసే ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు అమ్ముకొని మిల్లు యజమానులు కోట్ల రూపాయలను గడిస్తూ ప్రభుత్వానికి డబ్బులను బడ్జెట్ కు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు .

ప్రభుత్వాధికారులు కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతున్న మిల్లు యజమానులతో కుమ్మక్కై ఈ అక్రమాలకు తోడ్పడుతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు కఠినంగా ఈ అంశంపై విచారణ జరిపి ఈ తప్పిదాలు మరోసారి జరగకుండా చూసుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అధికారులు సక్రమంగా తమ విధులు నిర్వహించకపోతే ఈ అన్యాయాలు అక్రమాలను బిసిఎఫ్ బయటపెట్టి అడ్డుకుంటుంది అని మిల్లుయజమానులను ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా హెచ్చరించారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం జెండాలు మోసి జేజేలు కొట్టే కార్యకర్తలుగా వాడుకుంటూ బానిసలుగా వినియోగించుకుంటూ వారికి సరైనటువంటి నాయకత్వ స్థాయిని అందించకుండా మానసికంగా అవమానానికి గురి చేస్తూ వారి అగ్రకులాల వారి యొక్క బంధువులకు మాత్రమే అనుయాయులకు మాత్రమే పదవులను కట్టబెడుతూ నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తలను అణిచివేస్తున్నారు కాబట్టి ఇప్పటినుంచైనా బీసీలకు సరి అయినటువంటి ప్రాధాన్యత నిచ్చి మంచి నాయకత్వ స్థాయిని అందించి ప్రోత్సహించి గౌరవిస్తే అన్ని రాజకీయ పార్టీలు సజీవంగా ఉంటాయి లేకపోతే చరిత్ర గర్భంలో కలిసిపోతాయని ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు . ఈ సమావేశంలో BCF రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాడి భగవంతు గౌడ్ , రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి, మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపిటిసి , మహాజన మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానంపేట లీలావతి పాల్గొన్నారు.