
అక్షర స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలు కోదాడ పట్టణంలోని కట్టుకొమ్ముగూడెం రోడ్ నందు గల అక్షర స్కూల్ వార్షికోత్సవ వేడుకలను కరస్పాండెంట్ సజ్జ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బొప్పన భారతి, తుమ్మల సుశీల దేవి లు పాల్గొని వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో విన్యాసాలతో చేసి ఆకట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు పండుగలు వాటి విలువల గురించి స్కూల్ విద్యార్థులు విన్యాసాలు చేసి ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వేడుకలకు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జులు షాహిన్, మారుతి, అనిత, రామ్మోహన్ రావు తదితరులు పిల్లల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
