Spread the love

ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజా అఖండ విజయానికి అందరూ సమన్వయంతో పని చేయాలి.

  • ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ .

సమావేశంలో సహచర ఎమ్మెల్యేలతో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ .

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ,

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అందరు సమన్వయంతో పనిచేసి ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజా కి అఖండ విజయం చేకూర్చాలని ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

విజయవాడలో సుజన వెన్యూ కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ,
శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు , ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు, ఎన్నికల పరిశీలకురాలు, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి , ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా , ఉమ్మడి కృష్ణాజిల్లా సహచర ఎమ్మెల్యేలతో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 13,510 పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు డోర్ టు డోర్ తిరుగుతూ పట్టభద్రులను నేరుగా కలుస్తూ ఆలపాటి రాజా కి తొలి ప్రాధాన్యత ఓటును 1 అంకెపై వేసి గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకురాలు, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఇప్పటికైనా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారని వెల్లడించారు. సోషల్ మీడియాతో పాటు, అన్ని విధాలుగా ప్రచారాన్ని ముమ్మరం చేశామన్నారు. తను కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పట్టభద్రులతో నేరుగా మాట్లాడి ఆలపాటి రాజా విజయానికి కృషి చేస్తున్నానన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రతి 30 మంది పట్టభద్రులకు ఒక పరిశీలకుడిని నియమించామన్నారు. ఓటు నమోదు చేయించటం ఎంత ముఖ్యమో, ఆ ఓటర్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడటం కూడా అంతకంటే ముఖ్యమన్నారు. సార్వత్రిక ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యత్యాసం వుంటుందన్నారు. ఓటర్లకు తొలి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.