
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరచగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27, 2025న జరగనున్నాయి.
మైలవరం శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెంలో ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు
రెడ్డిగూడెం మండలంలో, టీడీపీ నాయకులు, ముఖ్యంగా మండల అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను క్రమేపి అమలు చేస్తున్నారని
కూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని పట్టబద్రులను కోరారు.
ఈ నేపథ్యంలో, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించేందుకు కూటమి నాయకులు, చేపల మడుగు కాంతారావు కిరణ్ రెడ్డి వేణుగోపాల రెడ్డి బాలకృష్ణ సోమేశ్వరరావు లు ప్రచారంలో పాల్గొన్నారు
