Spread the love

ఆలపాటి గెలుపు ప్రజా విజయం : మాజీమంత్రి ప్రత్తిపాటి.

రాజేంద్రప్రసాద్ విజయం కూటమిప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం : ప్రత్తిపాటి.

బ్యాలెట్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం, పట్టభద్రులు తమ ప్రభుత్వాన్ని ఆదరించడం శుభపరిణామం : పుల్లారావు.

“ కూటమిప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం తగ్గలేదని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే నిదర్శనం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా-గుంటూరు అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించడం సంతోషంగా ఉంది. 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆలపాటికి పట్టభద్రులు పట్టం కట్టడం.. ప్రభుత్వంపై వారికున్న అచంచల నమ్మకాన్ని తెలియచేస్తోంది. పెద్దల సభలో ఆలపాటి ప్రజాసమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తాడని నమ్ముతున్నాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర అభ్యర్థిగా గెలిచిన రాజశేఖర్ కు అభినందనలు. బ్యాలెట్ ఓటింగ్ లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించడం, పట్టభద్రులు తమ ప్రభుత్వాన్ని ఎంతగానో ఆదరించడం శుభపరిణామం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.