
అన్నీ దారులు అమరావతి రహదారి వైపే
చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 130బస్సు లలో వేల సంఖ్య లో తరలివెల్లిన కూటమి నేతలు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి ని ప్రకటించారు.
అమరావతి ని ప్రపంచం గర్వించదగ్గ రాజధాని గా తీర్చిదిద్దెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం తీసుకొని, నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదాగా పునఃప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.
ఈ బృహత్కర్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 130బస్సు లలో వేల మంది కూటమి నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ప్రజల రాజధాని అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపన వేడుకకార్యక్రమాన్ని తిలకించేందుకు నాయకులు తరలివెళ్లారు.
చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి ఆధ్వర్యంలో కూటమినేతలు జన సమీకరణ చేసి బస్సు లలో తీసుకు వెళ్లారు.
బస్సు లలో వెళ్లే నాయకులు, కార్యకర్తలు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు పటిష్టం గా తీసుకున్నారు
