Spread the love

పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచి నీటి ఇబ్బంది లేకుండా త్రాగు నీటి సఫరా చేయాలని సంబందిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు.

స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన వన మరియు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటి విడుదల్లో త్రాగు నీటికి తోలి ప్రాదాన్యత వ్వాలన్నారు. జిల్లాలోని ప్రధాన రెండు రిజర్వాయర్లలో కొంత నీటి కొరత ఉన్నందున సాగు నీటి విడుదలకు “వారబందీ ప్రక్రియలో” నీటిని విడుదల చేయాలన్నారు. అన్ని చెరువులలో పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం మేరకు నీటిని నిల్వ చేయాలన్నారు.

పల్నాడు జిల్లా కు ఎంత నీరు అవసరం ఉంది సంబందిత విషయాలను నీటి పారుదల అధికారులను అడగి తెలుసుకున్నారు. నీరు వృధా మరియు చెరువులలో నీరు లీకేజీ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులలో సాగు నీటి వినియోగం పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి ఇంగిలాల మురళి మాట్లాడుతూ రైతులు నీటి లబ్యత దృష్ట్యా కొత్తగా వరి పంటకు బదులుగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్, ఈ.ఈ లు మురళి కృష్ణ, శ్రీహరి ,ప్రేమ్ కుమార్, మురళీ, మరియు ఉద్యాన వన శాఖ అధికారి రామణా రెడ్డి, గ్రామీణ నీటి పారుదల అధికారి తదితరులు పాల్గొన్నారు.