TEJA NEWS

టేకుమట్ల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా : పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పిండిగ నాగేందర్
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పిండిగా నాగేందర్ హాజరై గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం దేశ స్వాతంత్రం కోసం రాజ్యాంగ ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని సాధించే విధంగా ఆయన చూపిన మార్గంలో నడుచుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు.దేశం పట్ల భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మసులుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు