
పేట పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మి ఫౌండేషన్ చేపట్టిన మీ పుట్టినరోజున ఒక మొక్క నాటండి”
పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మద్దీనగర్ ఖబరస్తాన్, మద్దినగర్ వీధుల ఎంట్రన్స్ వద్ద 25 మొక్కలు నాటే కార్యక్రమాన్ని
మెడికల్ సూపరింటెండెంట్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం
చిలకలూరిపేట : మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా మొక్కను నాటి, అమ్మి ఫౌండేషన్ చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఇలాంటి సామాజిక చొరవలు ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచే విధంగా సాగాలి. ప్రతి పౌరుడు మొక్క నాటే అలవాటు ఏర్పడితే, మన పట్టణాలు మళ్లీ పచ్చగా మారతాయి” అని అన్నారు.అమ్మి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ షేక్ అఫ్రోజ్ మాట్లాడుతూ, ఈ రోజుతో కలిపి ఒక నెల వ్యవధిలోనే 30 మొక్కలు నాటినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తమ ఫౌండేషన్ కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చేతన్, అజీజ్, ఆషిక్ రోషన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
