Spread the love

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

కలం నిఘా :న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 21
తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు.

యాంకర్‌ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ఆంధ్ర 365’ అనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కానున్న నేప థ్యంలో ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్‌‌ లు పుట్టుకొచ్చాయి. గతం లోని యాప్‌‌లు సహా కొత్త వాటి టార్గెట్‌‌ సామాన్య, మధ్య తరగతి ప్రజలే. బెట్టింగ్‌ యాప్‌ల వల్ల అప్పుల పాలై ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’పేరుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యాంకర్‌లు, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలం గాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో స్టార్స్ దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా అనన్య నాగళ్ల, శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి తోపాటు….

సౌందర్‌రాజన్, విష్ణుప్రియ, శోభా శెట్టి, రీతు చౌదరి, బీఎస్‌ సుప్రీత, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, హర్ష సాయి, బయ్యా సన్ని యాదవ్, టేస్టీ తేజలు.. ఉన్నారు. విష్ణుప్రియ, రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు.