TEJA NEWS

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే

సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌తో పాటు పలువురు మంత్రులతో సమావేశం కానున్న సీఎం

ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ కానున్న సీఎం చంద్రబాబు

24న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ వెళుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.