TEJA NEWS

ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు…ఇంటర్నేషనల్

ఈ స్కామ్ తో తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధమే లేదు..టోటల్ లోటస్ పాండ్ లోనే

లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు..రూ.10 వేల కోట్లకు పైనే

అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల కోట్లు దోచేశారు

ఆ మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రఖ్యాత ఎస్.జీ.ఎస్ ల్యాబ్ ఎప్పుడో చెప్పింది

కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచేయడంతో పాటు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలి

దురాశతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అంతిమ లబ్ధి పొందిన బిగ్ బాస్ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాల్సిందే

రూ.100 కోట్ల స్కామ్ కే ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం, నాలుగు రాష్ట్రాల ప్రముఖులు జైలుకెళ్లారు..ఇక రూ.10 వేల కోట్ల స్కాములో ఎంత మంది వెళ్లాలో

రూ.60 కోట్ల బోఫోర్స్ కుంభకోణంతో రాజీవ్ గాంధీ రాజకీయ పతనం ప్రారంభమైతే 2 జీ స్కామ్ తో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది

రూ.1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూశామా..

అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను అనుమతించలేదు

ఓ వైపు ప్రధానమంత్రి మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు

ప్రస్తుతం విచారణ సాగిస్తున్న సిట్ మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది

రూ.3200 కోట్ల కుంభకోణం అంటున్నారు…అనఫిషియల్ సేల్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు

వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ, సీబీఐ ఎందుకు రంగంలో దిగడం లేదు

రూ.1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదు

1989లో రూ.60 కోట్ల విలువైన బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ కుంపముంచింది

2014లో 2జీ స్కాం మన్మోహన్ సింగ్ ను దెబ్బకొట్టింది

ఈ రెండు స్కాములు కాంగ్రెస్ పార్టీకి జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి తెచ్చాయి

ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆషామాషీ కేసు కాదు

కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్ డౌన్ విధించారు. మే 4న మద్యం దుకాణాలను రీ ఓపెనింగ్ చేశారు..ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయి

కానీ లక్షల క్రేట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయినట్లు లెక్క చూపారు

జగన్ రెడ్డి పర్యవేక్షణలో నడిచిన కసిరెడ్డి అండ్ టీం ఎక్సైజ్ డిపార్టుమెంటులోని మద్యం డిపోలకు వెళ్లకుండా, స్కానింగ్ కాకుండా డిస్టలరీల నుంచి నేరుగా దుకాణాలకు స్టాక్ తరలించి అక్రమంగా అమ్మేసుకున్నారు

స్కామ్ 3200 కోట్లు కాదు 10 వేల కోట్లకు పైనే

ఎస్పీవై ఇండస్ట్రీ మిథున్ రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయిందని సజ్జల శ్రీధర్ రెడ్డి నాకు అప్పుడే చెప్పారు

మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి చెందిన మెక్ డోల్ డిస్టలరీ మూసుకునే పరిస్థితి వచ్చింది

అడిగినంత కమిషన్లు ఇవ్వలేదని నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ల డిస్టలరీలను అడ్డంగా మూసేశారు

ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ తీసుకునే వెసులుబాటును కూడా తొక్కేశారు. తామిచ్చిన మద్యమే తాగాలని నియంతలా వ్యవహరించారు…జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కు డబ్బుపై ఉన్న వ్యామోహంతోనే ఇది జరిగింది

ఐఎస్ఐ గుర్తింపు పొందిన చెన్నైలోని ప్రముఖ ఎస్.జీ.ఎస్ లేబరేటరీ సంచలన విషయాలు వెల్లడించింది

వైసీపీ ప్రత్యేకంగా ప్రోత్సహించిన ఆంధ్రా గోల్డ్, 9 సీ హార్సెస్, సిల్వర్ స్ట్రైప్ విస్కీలలో ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ టాలెట్ ఉన్నాయని తేల్చింది

ఇవి తాగితే శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతారని స్పష్టంగా నివేదిక ఇచ్చారు

అప్పట్లో నేను మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి మద్యం విక్రయాల్లో భారీ స్కామ్ జరుగుతోందని చెప్పాను.

కానీ అప్పటి ప్రభుత్వం మా మాటలు పట్టించుకోలేదు. తమకు డబ్బుంటే చాలనే లెక్కలో ముందుకెళ్లారు

అసలు మనుషుల ప్రాణాలు తీసే హక్కు వీళ్లకు ఎవరిచ్చారు

పహల్గామ్ లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే ప్రపంచమంతా చలించిపోతోంది

ఏపీలో కల్తీ మద్యం తాగి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది మంచాన పడ్డారు

నెల్లూరు పొగతోట హాస్పిటళ్లకు కేంద్రం. ఆ ప్రాంతంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ అనేక మంది ప్రాణాలు విడిచారు. చీప్ లిక్కర్ తాగి లివర్ దెబ్బతిని అనేక మంది చనిపోతున్నారని వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు

ప్రజల ఓట్లతో సీఎంగా ఎన్నికైన వ్యక్తి వారి జేబుల్లోని డబ్బును లాక్కోవడమే గాక వారి ప్రాణాలను తీసేయడం దుర్మార్గం

ఢిల్లీలో రూ.100 కోట్ల ఆరోపణలకు సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసింది

ఏపీలో రూ.10 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి.

ఇక్కడ రెండు రకాలుగా విచారణ జరగాల్సివుంది..అది సిట్ లెవల్ లోనే తేలిపోతుందా..లేక ఈడీ, సీబీఐ ఎంటరవుతాయో చూడాలి

కమీషన్లతో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అనధికారిక సేల్స్ ఒకటైతే, నాసిరకమైన మందు ఇచ్చి ప్రజలు ప్రాణాలను తీసుకోవడం రెండో నేరం

ఆవేశంలో కత్తి, రాయో తగిలి ప్రాణాలు ఒక మనిషి కోల్పోతే నిందితుడిపై హత్య కేసు బనాయించి జీవితఖైదు విధిస్తారు

ఇక్కడ నకిలీ మద్యం పోసి వేలాది మంది ప్రాణాలు బలితీసుకున్న వారికి ఎలాంటి శిక్ష వేస్తారు

ఈ లిక్కర్ స్కామ్ తో తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధం లేదు…టోటల్ లోటస్ పాండ్

కసిరెడ్డి అండ్ బ్యాచ్ మద్యం వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. డిస్టలరీలను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకమైన మద్యం తయారు చేయించింది

బ్రాండ్ ను బట్టి క్రేట్(48 బాటిల్స్) కు రూ.150 నుంచి రూ.600 చొప్పున కమీషన్ వసూలు చేశారు

అనఫిషియల్ సేల్ తో ఒక్కో క్రేట్ కు రూ.10 వేల వరకు ఆర్జించారు

ఈ కేసులో ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలి… వేల కోట్లు ఏ కుటుంబం చేతుల్లోకి వెళ్లాయి.. ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల్లోని అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది, ఏ కుటుంబం దురాశ కారణంగా అమాయకులు మంచాలపాలయ్యారో తేలాల్సిన అవసరం ఉంది

బాధితుల ఆర్తనాదాలు నేను స్వయంగా విన్నాను..వారి బాధలు ప్రత్యక్షంగా చూశాను.

మనుబోలు మండలం మద్దమూడిలో భర్తలు చనిపోయి 17 మంది వితంతవులుగా మారారు. వారి గోడు వింటే గుండె తరుక్కుపోతుంది

నడిబజారులో జరిగిన ఈ స్కామ్ ప్రత్యక్షంగా కనిపిస్తోంది..కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈడీ, సీబీఐలను రంగంలోకి దించాలి

దురాశతో అంతిమ ప్రయోజనం పొందిన బిగ్ బాస్ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాలి

రూ.1000 లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపుతుంది…వేల కోట్లు దోచేసి ప్రజల ప్రాణాలు తీసేసిన వారికి ఏ శిక్ష వేయాలి

ఇంత బహిరంగంగా జరిగిన దోపిడీ చరిత్రలో ఎక్కడా వినలేదు..చూడలేదు

క్యాష్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని, ఈ మందు తాగినందున ఎవరూ చనిపోలేదు అని వైసీపీలోని పెద్ద నాయకులు, జగన్ రెడ్డి రైట్లు, లెఫ్టులు ఎవరైనా చెప్పగలరా

మధ్యలో లక్షల క్రేట్ల మద్యం సేల్ ఎందుకు తగ్గిపోయిందే సమాధానం ఇవ్వగలరా

మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి కల్తీ మద్యం పోసి ప్రాణాలు తీయడం క్షమించరాని నేరం

అప్పుడేమో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు దోచేశాడు..మొన్నేమో పేదల ప్రాణాలను పణంగా పెట్టి దోపిడీ సాగించాడు

ఏ ప్రభుత్వంలో అయినా పొరపాట్లు జరుతాయి..వైసీపీలో జరిగినన్ని పాపాలు, నేరాలు ఘోరాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

మరోవైపు కసిరెడ్డి తనకు తెలియకుండా అదనంగా రూ.2 వేల కోట్లు ఎత్తేశాడని యల్లహంక ప్యాలెస్ లో కూర్చుని జగన్ రెడ్డి బాధపడిపోతున్నాడట