TEJA NEWS

వాహన తనిఖీల్లో పట్టుబడిన అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట పోలీసుల వాహనాల తనిఖీలలో పట్టుబడిన అంతర్ రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్. పోలీసులు తమదైన శైలిలో విచారించగా దొంగలించిన పది మోటార్ సైకిల్ స్వాధీనం. తెలంగాణలో దొంగలించినవి,ఆంధ్రాలో దొంగలించిన తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చి అమ్మేందుకు ప్రయత్నం. బస్టాండు సంతలో మరియు షాపుల వంటి రద్దీగా ఉండే జనాసంచారం గల ప్రదేశాల్లో నిలిపి ఉన్న వాహనాలను నకిలీ తాళ్లపు చెవులతో తస్కరించడమే టార్గెట్. మద్యం మరియు చెడు వ్యసనాలకు బానిసై మోటర్ సైకిల్ దొంగతనాలకుఅలవాటు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ గా పనిచేసే ముత్యాల. గణేష్ ఈరోజు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్సై అఖిల తన సిబ్బందితో భద్రాచలం రోడ్డులో HP పెట్రోల్ బంకు సమీపంలో వాహన తనిఖీలలో భాగంగా అశ్వారావుపేటలో దొంగలించిన మోటార్ సైకిల్ తో పరారీ అవుతుండగా పోలీస్ చెకింగ్ లో చిక్కినాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా 10 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు గా చెప్పి ఇందులోఅశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3, మోటార్ వాహనాలు.
1)H. Super splender, AP 28 BU 9663.
2) H, splender plus, AP 37 BM 1541.
3)H, HF DELUXE, TS 28 E 0924. నంబర్లు గల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒక వాహనం,B, pulsar, TS 07 FY 6267. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు మోటర్ వాహనాలు. 1)HF deluxe ap 37 ch 4157.
2)H splender pro ap 37 bg 4298.
3) H unicon ap 37 cq 9491
4)H glamour ap 37 cv 0839
5)H splender Ap37ap 1393
6)H unicon ap 37 dj 5634.
పక్క రాష్ట్రం అయిన ఏపీలోని తరికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు వాహనాలు దొంగలించినాడు. గణేష్ మద్యానికి,జల్సాలకు, వ్యాసనాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం అతని అలవాట్లకు, జల్సాలకు సరిపోక పోవడంతో సుమారు గత ఆరు నెలల నుండి మోటార్ సైకిల్ లను దొంగతనాలు చేసినాడు. అట్టి మోటార్ సైకిల్ లను పోలీసు వారు అంచుల సమక్షంలో స్వాధీన పరుచుకొని ముద్దాయిని రిమాండ్ కు తరలించారు. చాకచక్యంగా దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అశ్వారావుపేట పోలీసులను అభినందించిన పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సి,ఐ నాగరాజు, ఎస్సైలు, యాయాతి రాజు, అఖిల, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర రావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.