
భర్తను హత్య చేసిన భార్య అరెస్టు
ప్రకాశం జిల్లా …..
కంభం మండలం లో మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటనను పోలీసులు చేదించారు. కంభం పట్టణంలో ఈనెల 3వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసి, హత్య తర్వాత భార్య, భర్త అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా మీడియా సమావేశంలో డి.ఎస్.పి నాగరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితురాలిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్ కు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. అలానే మర్డర్ కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకుని, లోతుగా దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మరియు సిబ్బందిని డిఎస్పీ నాగరాజు అభినందించారు….
