
భవిష్యత్తులో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా కీలకం కానున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
డాన్ బాస్కో స్కూల్ లో ఏఐ డ్రోన్ రోబో ఫెస్ట్
ఫెస్ట్ ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విద్యార్ధులు ప్రతిభను మెచ్చుకున్న ఎంపి, ఎమ్మెల్యే
విజయవాడ : ప్రస్తుత కాలంలోని విద్యార్ధులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతో పాటు వినియోగించి ప్రయోగాలు చేయటంలోనూ ముందు వుంటున్నారు. రాబోయే కాలంలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవం రాబోతుంది. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్ పై కూడా విద్యార్ధులు దృష్టి పెట్టాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సూచించారు.
గురునానక్ రోడ్డులోని డాన్ బాస్కో సీబీఎస్ఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏఐ డ్రోన్ రోబో ఫెస్ట్ ను మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ప్రారంభించారు..
వీరికి స్కూల్ విద్యార్ధులు, యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. స్కూల్ ఆవరణలో విద్యార్ధులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి వాటి విశేషాలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులు ఈ ఫెస్ట్ లో దాదాపు 60 ప్రాజెక్టులు విద్యార్ధులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏఐ టూల్స్ వాడుకుని చక్కగా రకరకాల రోబోట్స్ తో పాటు డ్రోన్స్ ఉపయోగించి ప్రాజెక్టులు చేసిన విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. విద్యార్ధులకు క్వాంటమ్ కంప్యూటింగ్ పై అవగాహన కల్పించేలా చూడాలని ఉపాధ్యాయలకు సూచించారు. నిత్య జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అవసరం బాగా పెరిగిందన్నారు. డ్రోన్స్ వ్యవసాయ రంగంలో, డిఫెన్స్ రంగంలో కూడా వినియోగిస్తున్నారన్నారు. డ్రోన్స్, ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించని రంగం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి మార్పునే కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రాజెక్టులు చేసే విద్యార్ధులకు, ప్రొత్సహించే పాఠశాలకు సహకారం, ప్రోత్సాహకం వుంటుందన్నారు.
