Spread the love

ఆ సూర్యుడు ఈ సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం బ్రతికే ఉంటుంది

పేదవాడి రక్షనే ఎర్రజెండా లక్ష్యం, అజరామం అమరం కమ్యూనిస్టులు
కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు శాశ్వతం కాదని స్పష్టం

స్థానిక సంస్థల్లో పోటీకి ముందుకు రావాలని పార్టీ శ్రేణులకుపిలుపు …… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు
వనపర్తి
ఆ సూర్యుడు ఈ సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని పేదరికం సమూల మార్పు జరిగేంతవరకు పేదవాడి రక్షనే ఎర్రజెండా లక్ష్యంగా పనిచేస్తుందని ఒకే మాట ఒకే బాట ఒకే న్యాయం కమ్యూనిజం లక్ష్యమని పేదవాడి మంచి కోసం పోలీసులు వచ్చిన మిలిటరీ వచ్చిన భగత్ సింగ్ వారసులుగా కదం తొక్కుతారని మృత్యుంజయులు కమ్యూనిస్టులని అజరామం అమరం, కమ్యూనిస్టు రాజ్యం రావడం ఖాయమని అది ఎంతో దూరం లేదని తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు సిపిఐ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు

ఈ దేశంలో సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 25న ఆవిర్భవించి నేటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని పార్టీ ఆవిర్భావ సమయంలో దేశ స్వతంత్రం కోసం ఎర్రజెండాను పట్టిందని ఉద్యమాలు పోరాటాల ఫలితంగా స్వాతంత్రం లభించిందని సాయుధ భూపోరాటాల వలన సాగుభూములను సాధించడం రెండు దశలు గా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందని దాని ఫలితంగా దాదాపుగా ఐదు వేల మంది కమ్యూనిస్టులను బలి ఇవ్వడం జరిగింది వారిని ఈ సందర్భంగా స్మరించుకుందామనిఅన్నారు. దేశంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా వందేలుగా సిపిఐ పార్టీ సజీవంగా ఉందని కానీ రోజుకో పార్టీ మారే వారే తమ పార్టీని విమర్శిస్తున్నారని అలాంటి వారు తమని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు ఇప్పటివరకు దేశంలో జనతా పార్టీ స్వతంత్ర పార్టీ లు అధికారంలో కొంతకాలం ఉన్నాయని అధికారం పోగానే ఆ పార్టీ లు కనుమరుగైపోయాయ ని కానీ బిజెపి కాంగ్రెస్ ఒంటి పార్టీలు ప్రజలను మోసం చేసి అధికారం లోకి రావడంలో పిహెచ్డీలు సాధించాయని సిపిఐ మాత్రం జనం కోసం పోరాడడంలో పీహెచ్డీలు సాధించిందని అందుకే నేడు సిపిఐ శత ఉత్సవాల సంబరాలను జరుపుకుంటుందని అన్నారు
ఈ దేశంలోప్రభుత్వాలుచట్టాలను పేదవాళ్ళకి కాకుండా పెద్దవాళ్లకు దోచి పెట్టేందుకు తయారు చేసినవిగా మారాయని పేదవాళ్లంతా ఎర్రజెండాను పడితే కెసిఆర్ మోడీ అంబానీ ఆదాని లాంటి వాళ్లు ఈ దేశంలో ఉండరని నాయకుల కోసం కాదు ప్రజల కోసం పుట్టిందే కమ్యూనిజం పార్టీ అన్నారు బిజెపి బి ఆర్ ఎస్ పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం జరిగిందని కాంగ్రెస్ టిఆర్ఎస్ తదితర పార్టీలు కమ్యూనిస్టు పార్టీని వాడుకొని మోసం చేశాయని
కానీ ఒక్క స్థానం కోసం కమ్యూనిస్టు పార్టీ తలవంచుకోదని ప్రపంచాన్ని సృష్టించే సత్తా కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని
బి ఆర్ఎస్ దోచుకుని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్పై విమర్శల దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్తో పొత్తు శాశ్వతం కాదని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు సొంతంగా పోటీ చేయాలని కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓటు వేసి ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని కోరారు డిసెంబర్ 26న ఖమ్మంలో శతజయంతి సభతో సంబరాలు ముగుస్తాయని తెలిపారు అంతకుముందు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ మాట్లాడారు జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన వనపర్తి శ్వేతా నగర్ సిపిఐ ఆఫీసు నుంచి కూనమనేనికి స్వాగతం పలుకుతు అంబేద్కర్ చౌక్ రాజీవ్ చౌక్ ఇందిరా పార్క్ వివేకానంద చౌక్ పలు కూడళ్ళు మీదుగా దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వరకు ఎర్రజెండాలు ఎర్ర చీరలు కండువాలు ధరించి డప్పు వాయిదాలతో మహిళలు నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ఉత్సవాలలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ అబ్రహం మోష రాబర్ట్ గోపాలకృష్ణ శ్రీహరి ఎత్తం మహేష్ రవీందర్ కృష్ణవేణి గీత కుతుబ్ నరసింహ శెట్టి లక్ష్మీనారాయణ డంగు కురుమయ్య యూసుఫ్ కాకం బాలస్వామి నరేష్ వంశి భూమిక శిరీష సహదేవుడు కురుమయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.